తాడిపత్రి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం జేసీ ప్రభాకర్ రెడ్డి - టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసం కావడంతో పాటు పలువురు గాయపడ్డారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. ఈ క్రమంలో సోమవారం సీ ఐ సాయి ప్రసాద్ ఇరువర్గాలకు చెందిన 20 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.