రాష్ట్రంలో సగానికి పైగా బీసీలే ఉన్నారని, వారి అభ్యున్నతికి ఎల్లవేళలా పాటుపడతానని ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ రెడ్డి అనంతకుమారి అన్నారు. అమరావతిలో పదవీ భాద్యతలు తీసుకొన్న అనంతరం ఆమె శుక్రవారం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతకుమారి మీడియాతో మాట్లాడుతూ బీసీ కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించే దిశగా రాయితీలతో కూడిన రుణ సౌకర్యాలు కల్పించి ఆర్థికంగా నిలబడేలా కృషిచేస్తానన్నారు.