పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటును గతంలో స్వాగతించామని, ప్రస్తుతం పుట్టపర్తి నుంచి జిల్లా కేంద్రం హిందూపురానికి తరలిపోనుందని వస్తున్న వాదనలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రం తరలింపులో పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెజారిటీ ప్రజల అభిప్రాయానికి బిజెపి మద్దతు ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వం జిల్లా కేంద్రాల మార్పునకు సంబంధించి సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని, అందులో మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా సభ్యులుగా ఉన్నట్లు తెలియజేశారు.