మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం శాలిపేట గ్రామంలో గురువారం మధ్యాహ్నం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మంగంపల్లి రోహిత్ రావు దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుందన్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు సేవా కార్యక్రమాల్లో మెదక్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు