సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని ఉద్యోగ ఉపాధ్యాయుల జేఏసీ జిల్లా చైర్మన్ జావీద్ అలీ అన్నారు. సంగారెడ్డిలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.