నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులగా కురిసిన భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తడంతో ఖానాపూర్,కడెం మండలాల పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతా పంట పొలాల్లోకి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింధని శుక్రవారం బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీటమునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నీట మునిగిన పంటలను అధికారులు సందర్శించి నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.