అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ పలు పాఠశాలల్లో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష ప్రాముఖ్యతను తెలిపేందుకు ఉద్యమం నడిపినటువంటి గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పాడేరు సుండ్రు పుట్టు వద్ద ఉన్న భారతీయ విద్యా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆచార్య ఆధ్వర్యంలో తెలుగు భాషా ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేస్తూ అంతరించిపోతున్న ఆటలను విద్యార్థుల పంచ పోటీలను ఏర్పాటు చేసి తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.