ఆసిఫాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. శుక్రవారం సాయంత్రం గణేష్ నిమజ్జనం ఊరేగింపులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అఘోరాల వేషధారణతో చేసిన నృత్యాలు..భిన్నమైన మేకప్,ఆకర్షణీయమైన వస్త్రధారణ, ఉత్సాహభరిత నాట్యంతో నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న యువకులు భక్తుల్లో ఉత్సాహం నింపారు. వారిని చూసేందుకు రోడ్లపై జనాలు గుమికూడారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ తమ మొబైళ్లలో వీడియోలు తీశారు.