మలేరియా మాత్రలు మింగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కురుపాం మండలం, ఏగులవాడ పంచాయతీ, ఈతమాను గూడ గ్రామానికి చెందిన మండంగి సూరమ్మీ (30) 8 మలేరియా మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేసుకున్న శుక్రవారం చోటుచేసుకుంది. గురువారం రాత్రి మధ్యం సేవించవద్దని భర్త సురేష్ ను మందలించడంతో ఇద్దరి మధ్య నిన్న రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది 8 మలేరియా మాత్రలు మింగటంతో అపస్మారకస్థితికి వెళ్లడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నారాయణ రావు తెలిపారు.