మన్సురాబాద్ పెద్ద చెరువు కొలనులో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను గురువారం మధ్యాహ్నం కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి అని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశామని పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.