సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఈనెల 12న నిమ్ భూ బాధిత రైతుల ధర్నాను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్ గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నిమ్జ్ పరిధిలో 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం రైతుల నుండి భూమిని తీసుకోవడానికి నిరసిస్తూ శుక్రవారం జహీరాబాద్ లో నిరసన ప్రదర్శన కొనసాగించి ఆర్డిఓ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాకు భూ నిర్వాసిత రైతులు, కూలీలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్ హాజరవుతారన్నారు.