కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదాల నివారించేందుకు జిల్లా యంత్రాంగం తో పాటు ప్రత్యేక బృందాలు వచ్చాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. చెరువులు చెక్ డ్యాములు నిండిపోయినందున ప్రజలు నీటి వనరులకు దూరంగా ఉండాలని తెలిపారు. అవసరమైతే తప్ప ప్రయాణాన్ని చేయకూడదని తెలిపారు. వాగులు,చడరువుల వద్ద జాగ్రత్తగ ఉండాలన్నారు. ఏదైనా సమస్య జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 08468- 220069 కు సమాచారం ఇవ్వాలన్నారు.