రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు రాబోయే స్థానిక మరియు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు