నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణ శివారులోని నాగరంగం వెంచర్ నందు 1100 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో ఎస్సై చంద్రశేఖర్ సిబ్బంది సహాయంతో దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి ప్యాకెట్లలో గల 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం పట్టణ పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు, పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో పట్టణ శివారులోని నాగరంగం వెంచర్ నందు దాడులు చేపట్టారు. పోలీసులను చూసి నిందితులు పారిపోగా వారిని చాకచక్యంగా పట్టుక