అల్పపీడన ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాత వివరాలు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మలికిపురం మండలంలో అత్యధికంగా 90.6 మి.మీ వర్షం కురవగా, అయినవిల్లి మండలంలో అత్యల్పంగా 9.2 మి.మీ నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 29.6 మి.మీ వర్షపాతం నమోదైందని కలెక్టరేట్ అధికారులు తెలిపారు.