పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం మండలం, గొట్టివాడ పంచాయతీ, తెనుఖర్జ గ్రామంలోని తిమ్మకు సామన్న గారి ఇంటిలో శుక్రవారం గిరినాగు దర్శనమిచ్చింది. ఇంట్లో బుసలు కొడుతున్న గిరినాగు ను చూసి వారు భయంతో పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఇటీవల కురుపాం, సీతంపేట ఏజెన్సీలో గిరినాగులు దర్శనమిస్తున్నాయి.