లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను నాణ్యతతో నిర్మించుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఇంటి నిర్మాణాన్ని బట్టి అధికారులు బిల్లులు చెల్లించడం జరుగుతుందని నిర్మాణ స్టేజిని ఫోటో తీసి అధికారులకు పంపిస్తే బిల్లులు చెల్లిస్తారని సూచించారు.