గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన వనపర్తి జిల్లా బి.ఆర్.ఎస్వి నాయకులు. గ్రూప్ వన్ పోస్టుల్లో అవకతవకలు జరిగాయని వెంటనే జ్యూడిషియల్ కమిషన్ వేసి ఉద్యోగాల దొంగలు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా బి.ఆర్.ఎస్.వి నాయకులు తదితరులు ఉన్నారు.