మహిళల భద్రత మరియు సాధికారతను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించిందని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పేర్కొన్నారు. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి పథకంలో భాగంగా సంకల్ప కార్యక్రమాన్ని జిల్లాలో 2 సెప్టెంబర్ నుండి సెప్టెంబర్ 12 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా బుధవారం రాయచోటి కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల భద్రత మరియు రక్షణ కోసం ప్రభుత్వం వివిధ రకాల పథకాలను, చట్టాలను, ఏర్పాటు చేయడం జరిగింది