ఆళ్లగడ్డలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్, మున్సిపల్ కమిషనర్ కిషోర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ను నిషేధించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి, ఎంపీడీవో నూర్జహాన్, పాల్గొన్నారు