చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో చెప్పులు, రౌతులు, పాల డబ్బాలు పెట్టి ఉదయం 5 గంటల నుంచి బారులు తీరారు. గత మూడు రోజులుగా మండలంలో యూరియా లభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతు యూరియా సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని, చేతికి వచ్చిన పంట మట్టిలో కొట్టుకుపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఒక రైతుకు రెండు బస్తాలు యూరియా ఇస్తే ఎక్కడ సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.