జాతీయ న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి కర్నూలు–నంద్యాల జిల్లాల్లో 8,122 కేసులు పరిష్కారమయ్యాయి.శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన 60 మంది రైతుల వారసులకు మొత్తం ₹83,96,374 నష్టపరిహారం జిల్లా జడ్జి జి. కబర్థి చేతుల మీదుగా అందజేయబడింది.జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ, రెండు జిల్లాల్లో 20 బెంచీలను ఏర్పాటు చేసి కేసులను వేగంగా పరిష్కరించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, ఆరవ అదనపు జిల్లా జడ్జి వాసు, సిబిఐ కోర్టు జ