లంబాడీలపై పెద్ద కుట్ర సిఎం బాధ్యత వహించి ఫుల్‌స్టాప్ పెట్టాలి లేకుంటే పాలేరు నుండి బస్సు యాత్ర చేస్తాం,స్థానిక సంస్థల ఎన్నికల్లో లంబాడీల సత్తా చూపిస్తాం జిఓ 3ని రద్దు చేసినప్పుడు ఎక్కడికి పోయారీ ఆదివాసీ ఎంఎల్‌ఏలు బంజారా అడ్వకేట్ జెఏసి నాయకులు హరినాయక్ రాష్ట్రంలో లంబాడీలపై పెద్ద కుట్ర జరుగుతోందని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి దీనికి,పుల్‌స్టాప్ పెట్టాలని బంజారా అడ్వకేట్ జెఏసి నాయకులు హరినాయక్ డిమాండ్ చేశారు. ఖమ్మం లోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం రేవంత్‌రెడ్డి భద్రాద్రి జిల్లా పర్యటన సందర్భంగా లంబాడీల నాయకులను, యువతను అరెస్టు చేశారని,