ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో బుధవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం కలిగింది. కొన్ని ప్రాంతాలలో ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా గిద్దలూరు పట్టణంలో మాత్రం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడలేదు. మూడు రోజుల నుంచి అవస్థలు పడ్డ ప్రజలకు మోస్తరు వర్షంతో ఉపశమనం కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.