కడప జిల్లా జమ్మలమడుగు రజక వీధికి చెందిన 'ఏకదంత యువత' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుని మండపం వద్ద వినాయకుడి లడ్డు వేలం వేయగా ఇటుకల బట్టి రాజేశ్వరి మూడు లక్షల అరవై వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నట్లు ఆదివారం నిర్వాహకులు తెలిపారు. శనివారం రాత్రి వినాయకుడి లడ్డూకు వేలం నిర్వహించామన్నారు. లడ్డూతోపాటు 22 గ్రాముల బంగారు ఆభరణాన్ని రాజేశ్వరి కి ఉచితంగా అందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. నేడు ఆదివారం వినాయకుడి నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు .తెలిపారు.