అనంతగిరి హరిత రిసార్ట్స్ వ్యూ టవర్ ను సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జయంతో కలిసి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించి, ప్రైవేట్ రిసార్ట్స్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా హరిత హోటల్ ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జయం కు హరితను పైలెట్ ప్రాజెక్టుగా అప్పగించినట్లు తెలిపారు.