వరి రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అదును దాటిపోతున్నా యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కణేకల్ మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం తెల్లవారుజాము నుండే వందలాది మంది రైతులు క్యూలో నిలబడ్డారు. గంటల కొలదీ లైన్ లో నిలబడలేక కొందరు రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకాలు క్యూ లైన్ లో ఉంచారు. అరకొరగానే యూరియా సరఫరా చేయడంతో చాలా మంది రైతులు యూరియా దొరక్క వెనుదిరిగారు.