Araku Valley, Alluri Sitharama Raju | Sep 10, 2025
అరకు లోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్ అధ్యక్షతన ప్రపంచ ఓజోన్ దినాన్ని పురస్కరించుకొని (సెప్టెంబర్ 16) విద్యార్థిని విద్యార్థులకు బుధవారం సాయంత్రం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇటువంటి పోటీలను నిర్వహించడం వలన ఓజోన్ పొర పరిరక్షణ పట్ల విద్యార్థులకు అవగాహన కలుగుతుందన్నారు.