ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొర్రపాటి వారి పాలెం కు చెందిన విజయ్ కుమార్ కరుణాదేవికి పుట్టుకతోనే అంగవైకల్యం ఉంది. వారిద్దరు అన్నా చెల్లెలు పైగా దివ్యాంగులు ఇటీవల పింఛన్ తొలగింపు పై అధికారులు నోటీసులు అందించారు. తమ పింఛన్ తొలగించవద్దని ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేసినట్లుగా తెలిపారు. ఎలాంటి ఆధారం లేని తమకు పింఛన్ తొలగించవద్దని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.