శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఆర్మీ రిజర్వ్ పోలీస్ మైదానంలో సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఆర్ఐ శంకర్ ప్రసాద్ జండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఆర్ డిఎస్పి శేషాద్రి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక గంట సమయం వ్యాయామానికి కేటాయించాలని, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని తెలిపారు. అనంతరం యోగా ఆసనాల ద్వారా ఆరోగ్యంతో పాటు మన శరీర ఆకృతిని కాపాడుకోగలమని అన్నారు. ప్రతిరోజు సైక్లింగ్ అలవాటు చేసుకుంటే శరీరం దృఢంగా ఉంటుందని పోలీసు సిబ్బందికి తెలిపారు.