తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో సుమారు 99 లక్షల రూపాయలకు పైగా బకాయిలు పడ్డ నీటి పన్నుల వసూళ్లకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో కమిషనర్ మీడియాతో మాట్లాడారు. పట్టణ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వామిలయేందుకు పన్నులు కచ్చితంగా చెల్లించాలని కోరారు. పన్నుల వసూళ్ల కోసం మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు సరైన సమాధానం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ చేపట్టే విధంగా పండుగ చేసుకోవాలని తెలియజేశారు. అలాగే అనధికార లేవట్లను రెగ్యులర్గైజేషన్ చేసుకోవాలని కమిషన