తిరుపతి జిల్లా బాలాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం ఎంఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని, ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు.ప్రతి వ్యక్తి తాను ఎదగటానికి మార్గనిర్దేశం చేసిన గురువును మర్చిపోకూడదన్నారు.