ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పౌర సమాజం మద్దతుగా నిలబడాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ విజ్ఞప్తి చేశారు. మావలలో ఆయన మాట్లాడారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక వ్యక్తికీ, విలువలకు మధ్య జరుగుతున్న పోటీ అని, ఎంపీలు ఎటువైపు నిలబడతారో ఆలోచించాలని కోరారు. ఈ ఎన్నికలో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ విలువలను కాపాడాలని పేర్కొన్నారు.