ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న “ఓట్ చోర్ గద్ది చోడ్” ఉద్యమంలో భాగంగా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లాయర్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ కేంద్రం పీలేరు లో విస్తృత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా పీలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పట్టణంలోని పంచాయతీ మిట్ట వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.