విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేట బుడమేరు కాలవ సమీపాన చెత్తకుప్పలు పసికందు ను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పసికందు కేకలు వినబడటంతో స్థానికులు అజిత్ సింగ్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందుకు స్వల్ప గాయాలు రావడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు అనంతరం చైల్డ్ లైన్ అప్పగిస్తామని తెలిపారు