గుత్తిలోని చర్చి రోడ్డులో త్రైత సిద్ధాంతం ప్రబోధకుల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొమ్మిదవ రోజు అయిన ఆదివారం రాత్రి చిన్నారులకు భగవద్గీత శ్లోకాల పోటీలను నిర్వహించారు. చిన్నారులు వల్లివేసిన శ్లోకాలు శ్రోతులను ఎంతగానో ఆకట్టుకుని, ఆలోచింపజేశాయి. భగవద్గీత శ్లోకాల్లో విజేతలైన చిన్నారులకు త్రైత సిద్ధాంత ప్రబోధకులు బహుమతులు ప్రదానం చేశారు.