సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్ సమీపంలోని నల్లవాగు మధ్యతర సాగునీటి ప్రాజెక్ట్ నీటి మట్టం 1495 అడుగులకు చేరి పూర్తి స్థాయిగా ఉన్న FRL–1493 అడుగులు మించిపోయింది. ప్రాజెక్ట్ సామర్థ్యం 746 ఎం సి ఎఫ్ టి అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తిగా నిండింది. ఇన్‌ఫ్లో గా 12,064 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుంది. అలుగు ద్వారా అవుట్‌ఫ్లో 12,049 క్యూసెక్కులు, ఎడమ ఫ్లో కెనాల్ ద్వారా 15 క్యూసెక్కులు నీరు విడుదల అవుతోంది. రైతులకు సాగునీటి సరఫరా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.