కృష్ణా జిల్లాలో వేగవంతంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కృష్ణా జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగంగా జరుగుతోంది. జిల్లాకు మొత్తం 5,48,329 స్మార్ట్ రేషన్ కార్డులు రాగా వీటిలో తొలి రోజు 33,391 కార్డులను సచివాలయం ఉద్యోగులు మంగళవారం మద్యాహ్నం 4 గంటల వరకు ఇంటింటికీ వెళ్లి కార్డ్ హోల్డర్ కు పంపిణీ చేశారు. ఇంకా 5,14,938 కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. సచివాలయాల వారీగా ఆయా నియోజకవర్గ ప్రజా ప్రతినిథులు, కూటమి నేతలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.