చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కోర్టు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బాధితులతో ప్రజాసంఘాలతో ప్రజాప్రతినిధులతో చర్చ వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్యలను తీసుకొని రాగా మున్సిపల్ అధికారుల ద్వారా వాటికి పరిష్కారం మార్గాలను చూపుతూ, పూర్తిగా రోడ్డు విస్తరణలో దుకాణాలు ఇండ్లు కోల్పోయిన బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జెసి విద్యాదరి తదితరు పాల్గొన్నారు