సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చాల్కి గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన ఓ రైతు తన పట్ట భూమిలో పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేయగా గుర్తించిన ఎక్సైజ్ , పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి 17 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సింది.