గురజాల నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను అక్రమంగా తమ పేరు మీద ఆన్లైన్ చేయించుకొని బ్యాంకు రుణాలు పొందిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు గురజాల ఆర్డీవో మురళీకృష్ణ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు. గురజాల దాచేపల్లి మాచవరం పిడుగురాళ్ల మండలాల్లో జరిగిన భూ కుంభకోణాలపై ప్రభుత్వానికి నివేద ఇచ్చామన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యులైన ఆక్రమణదారులు అధికారులపై తదుపరిచార్యలు ఉంటాయని పేర్కొన్నారు.