తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భముగా ఆలయ ఆవరణంలో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ సహాయక కమీషనర్ ప్రసన్న లక్ష్మి పర్యవేక్షణలో జరిగిన ఈ పూజల్లో ముందుగా ఉభయదాతలతో కలిసి EO పసుపు, కుంకుమ, గాజులు, పూలు తీసుకొని ఆలయంలోని అమ్మణ్ణికి సమర్పించారు. పూజలు చేసిన అనంతరం తిరిగి వాటిని ప్రాకార మండపంలో కొలువుతీర్చిన అమ్మణ్ణి ఉత్సవ మూర్తి వద్దకు చేర్చి వేదపండితులు సామూహిక వరలక్ష్మి వ్రత పూజలను ప్రారంభించారు. ఎప్పుడు లేని విదంగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పూజల్లో పాల్గొనడానికి రావడంతో ఆలయం అంత కిక్క