మహిళలలో వ్యాపార సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికతపై అవగాహన కల్పించడంతో పాటు, వ్యాపార విస్తరణకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.బుధవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో ర్యాంప్, డిఆర్డీఓ, పరిశ్రమల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపార నైపుణ్య అవగహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.