భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలం చెంచుపల్లి గ్రామస్తులకు ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం సాయంత్రం కొత్తపల్లిగోరి మండలం చెంచుపల్లి గ్రామంలో ఐటీడీఏ నిధులు రూ.143.19 లక్షలతో చెంచుపల్లి నుండి ఆర్ అండ్ బీ రోడ్డు రేగొండ మండల కేంద్రం వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై, టెంకాయ కొట్టి అట్టి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన వేదికపై గ్రామానికి చెందిన మొత్తం 16 మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులను