Araku Valley, Alluri Sitharama Raju | Sep 10, 2025
గూడెం కొత్తవీధి మండలంలోని గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలో నేలజర్త మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఈ ఏడాది జూన్ నెల నుంచి ఇప్పటి వరకూ ఈ స్కూల్ కి ఒక్క టీచర్ రాలేదు. ఈ పాఠశాలలో 104 మంది విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయులు లేరని,ఇక్కడ ఉపాధ్యాయులను నియమించాలని పలు సార్లు మండల విద్యా శాఖ అధికారులకు విన్నవించినా ఇప్పటి వరకూ ఒక్క టీచర్నీ కూడా నియమించ లేదని దండ కారణ్య విమోచన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొర్ర మార్క్ రాజు ఆరోపించారు. వెంటనే పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని లేని పక్షంలో తల్లిదండ్రులతో పాడేరు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని మార్క్ రాజు తెలిపారు.