యాడికి మండలం రామరాజు పల్లి లో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తరలివచ్చారు.భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అర్చనలు, అభిషేకాలు వంటి పూజలు చేశారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.