వైసిపి ఐదేళ్ల పాలనలో కేవలం 500 రూపాయలు మాత్రమే పింఛన్ రూపంలో పెంచారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తుందని వెల్లడించారు. మనుబోలు మండలం వడ్లపూడి తదితర ప్రాంతాలలో పర్యటించిన ఆయన.. పింఛన్లు పంపిణీ చేసి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడారు