నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం తనిఖీ చేశారు. ఈఎన్టీ వైద్య సేవలు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులకు సూచనలు, సలహాలు చేశారు. ఆస్పత్రికి వచ్చే వారిపట్ల వైద్యాధికారులు వైద్య సేవలు అందిస్తూ ప్రజాసేవకు అంకితం కావాలన్నారు. సదరన్ క్యాంపులో దివ్యాంగులను ఇబ్బంది పెట్టవద్దని వైద్యులకు సూచించారు. దివ్యాంగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.