ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల ఉన్నత పాఠశాలలో గురువారం ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ అధికారులు విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నియంత్రణ అధికారి వినయ్ విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధి ఎలా సోకుతుందో సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని ఈ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒకరు లేదా ఇద్దరూ అంతకుమించి భాగస్వాములతో లైంగికంగా కలవడం లేదా కలుషితమైన సిరంజీలు వాడటం రక్తాన్ని పరీక్షించకుండా ఎక్కించుకోవడం వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకుతుందన్నారు.