దిలావర్ పూర్ మండలంలోని కాల్వ తాండలో శ్రీ శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారికి వారి ఆలయంలో తీజ్ పండుగను ఆదివారం సాంప్రదాయ పద్ధతులలో నిర్వహించుకున్నారు. కులపరమైన గీతాలాపనల మధ్య నృత్యాలు చేస్తూ గిరిజన మహిళలు అమ్మవారికి నైవేద్యాలను సమర్పించుకున్నారు. ఈ యేడు కూడా సమృద్ధిగా పంటలు పండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.